మాతృమూర్తులకు పాదాభివందనం – మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి నిత్యం బిడ్డ క్షేమం కోరుకునే మాతృమూర్తికి ఎంత సేవ చేసుకున్నా తక్కువేనని, అమ్మను మించిన దైవం ఈ ప్రపంచంలో ఏదీ లేదని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి లోని రవికుమార్ యాదవ్ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాతృమూర్తులను శాలువాలతో సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ‌మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ అమ్మను మించిన యోధులు ఈ లోకంలో ఎవరూ లేరని, కనిపించే దైవం అమ్మ అని అన్నారు.

మాతృదినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ‌బిక్షపతి యాదవ్

ప్రతీ అమ్మాయిలోనూ అమ్మ ఉందని, ప్రతీ ఒక్కరూ అమ్మని గౌరవించినట్టే ప్రతీ అమ్మాయిని గౌరవించాలని సూచించారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అమ్మ లేకపోతే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదని అన్నారు. సృష్టికి మూలం స్త్రీ అని, ప్రతి రోజూ మాతృమూర్తులకు సేవ చేసుకోవాలని పేర్కొన్నారు. మాతృమూర్తి ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు. అనిత హరి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి పాదాభివందనం చేశారు. తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లో పెట్టవద్దని, వారిని భారంగా చూడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పద్మ, రేణుక, అరుణ, ఇందిర, ఝాన్సీ, మల్లీశ్వరి, లక్ష్మీ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

మాతృమూర్తులకు పాదాభివందనం చేస్తున్న రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here