శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): నడిగడ్డ తండా గిరిజనులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న CRPF వారిపై నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు (ST) జాటోతు హుస్సేన్ నాయక్ ని కలిసి నాయకులు వివరించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి సంబంధించిన వారికినోటీసులు పంపి సమస్య పరిస్కారం అయ్యేలా చూస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆల్వార్ స్వామి నాయక్, సీతారాం నాయక్, తిరుపతి నాయక్, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.