3ఏ సైడ్ వాలీబాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పీజేఆర్‌ స్టేడియం విద్యార్థుల సత్తా

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన 2వ యూత్‌ అండర్‌-21, అండర్‌-14 3ఏ సైడ్‌ వాలీబాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో పీజేఆర్‌ స్టేడియం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో పీజేఆర్‌ స్టేడియం విద్యార్థులు నాలుగు విభాగాల్లో పతకాలు సాధించారు. అండర్‌-14 బాలుర విభాగంలో మూడో స్థానం, అండర్‌-14 బాలికల విభాగంలో రెండో స్థానం సాధించారు. అలాగే అండర్‌-21 బాలుర విభాగంలో రెండో స్థానం, అండర్‌-21 బాలికల విభాగంలో మూడో స్థానం దక్కించుకున్నారు.

నాసిక్‌లోని మినా తాయ్ ఠాక్రే స్టేడియంలో సెప్టెంబర్‌ 7 నుంచి 9 వరకు ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. 3ఏ సైడ్‌ వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో, 3ఏ సైడ్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నిర్వహించిన ఈ పోటీల్లో పలు రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. పీజేఆర్‌ స్టేడియం విద్యార్థులు నాలుగు విభాగాల్లో పతకాలు సాధించడంపై కోచ్‌ వెంకట్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ, సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పీజేఆర్‌ స్టేడియం విద్యార్థులు సత్తా చాటడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here