బిందెశ్వర్ ప్రసాద్ మండల్ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప‌లువురికి ఆహ్వానం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీల ఆరాధ్య దైవం బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో అవార్డుల ఫంక్షన్ కు రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ ని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆహ్వానించారు. వీపీ సింగ్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం చేయాలని బిందెశ్వర ప్రసాద్ మండల్ ని బీసీ కమిషన్ చైర్మన్ గా ఏర్పాటు చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింద‌ని, బిందెశ్వర్ ప్రసాద్ చైర్మన్‌గా బీసీల అభివృద్ధి కొరకు పేదరిక నిర్మూలనలో భాగంగా 40 సిఫార్సులను బీ.పి. మండల్ విపీ సింగ్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా సమర్పించడం జరిగింద‌న్నారు. అందులో భాగంగా బీసీలకు 27% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీల కొరకు ఆహర్నిశ కాలం పాటుపడి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి అంబేద్కర్ మహాత్మ ఫూలేతో చేరిన బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థం 13 ఏప్రిల్ 2025 న ఆదివారం ఉదయం 9 గంటలకు బషీర్ డాగ్ ప్రెస్ క్లబ్ లో అవార్డుల ఫంక్షన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ముఖ్య నాయకులను ఆహ్వానించడం జరిగింద‌న్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ ని గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, మధు యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షుడు కుమార్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here