శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ లో మాజీ డివిజన్ అధ్యక్షుడు డి.సురేష్ నాయక్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక నాయకులు, నియోజకవర్గం నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.