శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్ను మూయడం దేశానికి తీరని లోటని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన వ్యక్తి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.కృష్ణ, మిరియాల రాఘవరావు, కృష్ణ ముదిరాజ్, మన్నెపల్లి సాంబశివరావు, ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గఫర్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ గౌడ్, సంగారెడ్డి, రవి కుమార్, కార్తీక్ గౌడ్, వెంకట్ రెడ్డి, పోచమ్మ, శివ గౌడ్, యాదగిరి, లక్ష్మణ్, బాలరాజ్ ముదిరాజ్, భారత్, జావీద్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముషారఫ్, శివానంద రెడ్డి, సుస్మిత, యూత్ నాయకులు దుర్గేష్, సాయి కిషోర్, కృష్ణ, యాదయ్య, సుధాకర్, నజీర్, వెంకటేష్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, రాజు, జయ సాయి, సతీష్, మహిళలు పార్వతి, జయ, మౌనిక, నాగమ్మ, కల్పన, స్వాతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.