చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా గెలుపొందిన మంజుల రఘునాథ్ రెడ్డికి డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్‌కాలనీ, పలు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి డి.వెంకటేశం, ఆర్‌టీసీ యూనియన్, బస్ స్టేట్ కమిటీ నాయకుడు డీవీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, కార్యనిర్వాహక కార్యదర్శి నాగార్జున రావు, కోశాధికారి నరసింహారావు, సలహాదారులు కృష్ణ నాయక్, రమేష్ బాబు, రవీంద్ర నాథ్, రవిచంద్ర, తిలక్, రతన్ పాల్గొన్నారు.

