నమస్తే శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి కొలనులను ఏర్పాటు చేసిందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని గంగారం చెరువులో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన కొలనును అధికారులతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కొలనులో నిమజ్జనం చేసే విగ్రహాలను, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నీటిని పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా కొలను వద్ద టేక్నిషియన్ ను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. భక్తులు, నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దుబే, రవీందర్ రెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.