నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ టవర్స్ అసోసియేషన్ వారు అపోలో హాస్పిటల్ వారి పర్యవేక్షణలో క్లబ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీర డైమండ్ టవర్స్ అసోసియేషన్ వారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, అసోసియేషన్ వారు అపోలో ఆసుపత్రి సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం అభినదించ దగ్గ విషయమని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మంజీర డైమండ్ టవర్స్ లో నివసిస్తున్న ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. అవకాశాన్ని అందరు సద్వినియోగ పర్చుకోవలని పిలుపునిచ్చారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసించే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ లలో ఇలాంటి ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల త్వరిత గతిన వ్యాక్సిన్ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సురేందర్, మంజీర డైమండ్ టవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నాయర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్,సెక్రటరీ అతుల్ సింగ్ తాయి, మెంబెర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.