నమస్తే శేరిలింగంపల్లి: మదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తిలో నిరుపేదలకు శుక్రవారం ఆర్‌కేవై ప్రాణహేతు ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. బిజెపి మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని నిరుపేదలకు వెజిటెబుల్ బిర్యానీ బాక్సులను అందజేశారు. వారికి అందచేశారు అనంతరం మాట్లాడుతూ లాక్ డౌన్ వల్లా ఇబ్బందులు పడుతున్న పేదవారికి మానవతా దృక్పతం తో నిత్యావసర సరుకులు, భోజనం, మందులు అందచేస్తున్న ఆర్‌కేవై ప్రాణహేతు సభ్యులను అభినందించారు. ఆర్‌కేవై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలం, దానికితోడు లాక్‌డౌన్ సమయంలో ఉపాధి లేక అవస్థలు పడుతున్న వారికి తోచిన సహకారం అందిచడమే తమ లక్షమని అన్నారు. ఇక మీదట కూడా ప్రతిరోజు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కేవై టీమ్ సభ్యులు వినోద్ యాదవ్, జాజిరావు, శ్రీను, చంద్ర మాసిరెడ్డి, మధు యాదవ్, అశోక్, ఆనంద్, మంజునాథ్, గేదెల శివ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
