నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ తండాలోని శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం వద్ద పలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతిఒక్కరి పైనా ఉందని అన్నారు. ప్రకృతిని విస్మరించడం వల్లే అనేక పరిణామాలు చవిచూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సీతారామ్ నాయక్, గోపి, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
