నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు జారిపడి కాలు సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను సగర సంఘం రాష్ట్ర కమిటీ మంగళవారం పరామర్శించింది. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సగర లు మందకృష్ణ మాదిగ ను కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.