మహిళా మోర్చా అధ్వర్యంలో గర్భిణీ‌ స్త్రీలకు ఘనంగా శ్రీమంతం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద శేరిలింగంపల్లి అసెంబ్లీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, నరేష్, ప్రభాకర్ యాదవ్, గోవర్ధన్ గౌడ్ హజరై గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీలో గర్భిణీ స్త్రీలకు బట్టలు, పండ్లు, పూలు, స్వీట్లు, అందజేయడం జరుగుతుందని అన్నారు. పుట్టబోయే శిశువు మంచి ఆరోగ్యంతో ఉండేలా పోషకాహారం అందించాలని సూచించారు.అంగన్ వాడీ ఉపాధ్యాయులను, ఉద్యోగులను చీరలు, తాంబూలం తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100మంది పైగా గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు బిజెపి మహిళా మోర్చా, బిజెపి నాయకులు వీణా రెడ్డి, వినయ, పార్వతి, విద్యా కల్పన, శృతి, రాధామూర్తి, వినీతా సింగ్, స్వాతి, మియాపూర్, హఫీజ్ పేట డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు, శ్రీధర్ రావు, భీమని విజయలక్ష్మి, పల్లవి, సరస్వతి, కౌశల్య, బాబ్లీ పలువురు మహిళా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here