శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ ధర్మపురి క్షేత్రానికి ఉదయం నుండి జ్యోతిర్మయ ఆత్మలింగేశ్వరుని, దుర్గా మల్లేశ్వరి మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, స్వామివారి అనుగ్రహం పొందడానికి భక్తులుగా తండోపతండాలుగా విచ్చేశారు. విశ్వహిందూ పూర్వ అధ్యక్షుడు పుల్లా రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. పానిని ప్రభాత కన్యా మహా విద్యాలయ, సవిత ఆచార్య చిన్నారులచే వేద పఠనం నిర్వహించారు. అనంతరం నృత్య ఉల్లాసం గుడి సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి చూసి ఎంతో ఆనందించారు.