కష్ట‌కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిలిచిన యువ నాయ‌కులకు ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తు: మ‌ధు యాష్కీ, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధు యాష్కీ గౌడ్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ యాద‌వ్‌ల‌ను కొండాపూర్ డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేట‌ర్ మ‌హిపాల్ యాద‌వ్‌, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల పార్ల‌మెంట్ మాజీ కార్య‌ద‌ర్శి దుర్గం శ్రీహ‌రి గౌడ్‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నుంచి ఎన్నో ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు పొందిన పెద్ద పెద్ద నాయ‌కులే పార్టీని వీడీ వెళ్లినా క‌ష్ట‌కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిలిచిన‌ మ‌హిపాల్ యాద‌వ్‌, దుర్గం శ్రీహ‌రి గౌడ్ లాంటి నాయ‌కుల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని అన్నారు. చేవెళ్ల పార్ల‌మెంట్ ఇన్చార్జ్‌గా అంజ‌న్‌కుమార్ యాద‌వ్ రానున్న నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేలా కృషి చేస్తామ‌ని అన్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రు అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేనని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల పోరాటంలో ముందుండాల‌ని, త‌మ పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని మ‌ధు యాష్కీ, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌లు పేర్కొన్న‌ట్టు వారు తెలిపారు.

మధు యాష్కీతో మాట్లాడుతున్న మ‌హిపాల్ యాద‌వ్‌, దుర్గం శ్రీహ‌రి గౌడ్‌
అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌తో స‌మావేశ‌మైన మ‌హిపాల్ యాద‌వ్‌, దుర్గం శ్రీహ‌రి గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here