హైటెక్‌సిటీ వ‌ద్ద అదుపుత‌ప్పిన బైక్‌… డివైడ‌ర్‌ను ఢీకొని యువ‌కుడు మృతి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బైక్‌ డివైడ‌ర్‌ను ఢీకొట్టడంతో ఓ యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వీంద్ర‌ప్ర‌సాద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, నిర‌ద‌వోలు ప్రాంతం, పెండ్యాల గ్రామానికి చెందిన జి.సంజ‌య్ వ‌ర్మ‌ (21) కుక‌ట్‌పల్లి ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లోని ఓ హాస్ట‌ల్‌లో ఉంటు చ‌దువుకుంటున్నాడు. కాగా శ‌నివారం రాత్రి 10 గంట‌ల ప్రాంతంలో సంజ‌య్ త‌న సుజుకి జిక్స‌ర్ బైక్‌(ఏపీ 39 బీకే 0670)పై కేపీహెచ్‌బీ నుంచి రాయ‌దుర్గం వైపు వెళుతున్నాడు. హైటెక్‌సిటీ ట్రైడెంట్ హోట‌ల్ వ‌ర‌కు చేరుకోగానే వేగంగా వ‌స్తున్న‌ సంజ‌య్‌వ‌ర్మ బైక్ అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయ‌ల పాలైన సంజ‌య్‌ను స్థానిక మ్యాక్స్‌క్యూర్ ద‌వ‌ఖానాకు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు దృవీక‌రించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు.

మృతుడు జి.సంజ‌య్ వ‌ర్మ (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here