నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు కాంక్రీట్ ప్లాంట్‌లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాళ్ ప్రాంతానికి చెందిన సగ్భర్ అలీ(22) బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి మాదాపూర్‌లో కూలి పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోని మాదాపూర్‌లో కొనసాగుతున్న 360 లైఫ్ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సైట్‌లోని కాంక్రీట్ ప్లాంట్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. సగ్భర్ అలీ మృతితో 360 లైఫ్ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని అదుకోవాలని తోటి కార్మికులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
