నమస్తే శేరిలింగంపల్లి:పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాదాపూర్ పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంఎన్ జీ క్యాన్సర్ ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రవీందర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామని అన్నారు. యువకులు, ఆరోగ్యవంతులు రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. రక్తదానం చేసిన 88 మంది రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ పరిధిలోని ఆయా సెక్టార్ ల ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది, పలువురు యువకులు పాల్గొన్నారు.