సాయి నగర్ లో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సహదేవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బుధవారం మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, టిఆర్ఎస్ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ శక్తివంతమైన పార్టీగా నిలుస్తుందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులను అధిష్టానం ఎన్నడూ మరవదని, మంచి భవిష్యత్తును ఇవ్వడం ఖాయమన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధినాయకత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో ప్రతీ కార్యకర్త సైనికునిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు బిక్షపతి ముదిరాజ్, సయ్యద్ గౌస్, గోపాల్ నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఓ.కృష్ణ, అర్జున్, ప్రభు, రాజు, సెల్వరాజ్, రఘునాథ్, మల్లా రెడ్డి, మాదాపూర్ డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా, యూత్ నాయకులు గోపాల్, సుబ్రమణ్యం, జైపాల్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాయినగర్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here