నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నార్నె ఎస్టేట్స్, సెంట్రల్ పార్క్ ఫేస్ 2 లలో రూ. 2 కోట్ల అంచనావ్యయం తో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రజా అవసరాల దృష్ట్యా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా చేపట్టాలన్నారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని వరద నీటి కాల్వ నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, పవన్, గోపాల్, ప్రసాద్, సెంట్రల్ పార్క్ ఫేస్-2 అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ రమణి శ్రీరామనేని, సురేష్, రామకృష్ణ, హరినారాయణ, ప్రవీణ్, వేణు, రాధాకృష్ణ, జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.