నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో యూజీడీ పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. 4 కోట్ల 25 లక్షల వ్యయం తో మాతృ శ్రీ నగర్, ఆదిత్య నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్, జూబ్లీ గార్డెన్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్, చంద్ర నాయక్ తండా, మాదాపూర్ సాయి నగర్ లలో యూజీడీ పనులు చేపట్టనున్నట్లు ఆరెకపూడి గాంధీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు ఈ. శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షుడు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ సాంబశివ రావు, నాయకులు మధుసూధన్ రెడ్డి, ఎం.డి.గౌస్, మాతృ శ్రీ నగర్ కాలనీ అధ్యక్షుడు అనిల్ కావూరి, శ్యామ్, వార్డ్ సభ్యులు రహీమ్, శ్రీనివాస్, రాంచందర్, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కాసిం, సుభాష్ చంద్ర బోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, ఎం.వి.వి. నారాయణరెడ్డి, లాలూ నాయక్, హున్య నాయక్, లియకత్, మైనారిటీ నాయకులు బాబు మియా, సలీం, మునాఫ్ ఖాన్, ఉస్మాన్ భాయ్, సత్యం, రహ్మాన్, అజీమ్, రాములు యాదవ్, లోకేష్, ఖాజా,తైలి కృష్ణ, రంగా స్వామి,సత్తి రెడ్డి, రమేష్, రెడ్డి, భాస్కర్ రెడ్డి, అజయ్, గోపాల్, నాగరాజ్, విజయ్, సతీష్, సాయి కృష్ణ, వాసు, శ్రీకాంత్, సాయి యాదవ్, సంతోష్, అర్షద్, అంకా రావు, సుధాకర్ ముదిరాజ్, రమణ రెడ్డి, రఘురాం, సత్య రెడ్డి, లక్ష్మణ, మహేందర్, బాలరాజ, రామాంజనేయులు, రాందాస్, నర్సింహ, మహిళలు శేశిరేఖ, శ్రీజ రెడ్డి, ఉమాదేవి, సీతమ్మ, వర్క్ ఇన్‌స్పెక్టర్ శర్మ, వెంకటేష్, చారి, బాలు, ఎస్.అర్.పి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా,కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.