హఫీజ్ పేట్ డివిజన్ లో రూ. 5.9 కోట్లతో యూజీడి పనులకు శంకుస్థాపన: ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం రూ. 5.9 కోట్ల నిధులతో యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. శాంతినగర్, రాజీవనగర్, అంజయ్యనగర్, ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామంలో, సాయి నగర్, యూత్ కాలనీ, జనప్రియ నగర్-2, దేవి హోమ్స్ లవెండర్, గంగారాం గ్రామంలో, హుడా కాలనీ, ఇంజినీరింగ్ ఎన్ క్లేవ్ మైత్రి నగర్, మైత్రి నగర్ ఉషోదయం హెచ్.ఐ.జి కాలనీ మంజీర రోడ్డు, అల్విన్ కాలనీ, మదీనగూడా గ్రామం, వీకర్ సెక్షన్ కాలనీ, రామకృష్ణనగర్, ఆర్.టి.సి కాలనీ, మంజీర రోడ్డు లో యూజీడీ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, వార్డ్ సభ్యులు కనకమామిడి‌ వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, గౌస్,‌ శాంతయ్య, రమేష్, శ్రీశైలం, సాబేర్, ముజీబ్, సుదేశ్, జితేందర్ రెడ్డి, పరమేష్, రఘునాథ్, పూర్ణచందర్ రావు, దామోదర రెడ్డి, నర్సింహ గౌడ్, నాగేశ్వర రావు, శ్రీనివాస్, పద్మ రావు, సుధాకర్, వెంకట్ నారాయణ, సత్యం, రాంచందర్ మూర్తి, రాము రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, కోటేశ్వర రావు, వెంకట్ రెడ్డి, యదయ్య, మహిళలు ఆశ, పద్మ, శ్రీదేవి, లక్ష్మి, సుశీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సత్యనారాయణ, హరి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా,కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ ‌విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here