మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు డి.నగేష్ ఆదివారం పార్టీ అగ్రనేతల చేతుల మీదుగా బి-ఫాం అందుకున్నారు. టీపీసీసీ కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం జీహెచ్ఎంసీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కౌశల్ సమీర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎం.రఘునందన్ రెడ్డిల చేతుల మీదుగా నగేష్ బి-ఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.
