నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్ నగర్ ఖానామెట్ హిందూ బొందల గడ్డ(శ్మశాన వాటిక) స్థలం వేలం పాట ఆపేందుకు ప్రయత్నిస్తారని గురువారం బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ తో పాటు పలువురు బిజెపి నాయకులను మాదాపూర్ పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఖానామెట్ బొందల గడ్డ స్థలాన్ని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ స్థలాన్ని వదులుకోమని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. అరెస్టయినవారిలో రాధాకృష్ణ తో పాటు బిజెపి డివిజన్ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి టివి మదనాచారి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలకుమార్, యాస కుర్మయ్య, సాయులు, బిజెవైఎం నాయకులు భరత్, నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
