నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మరో నిజాం ప్రభుత్వాన్ని తలపిస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. గోరక్షణ సమితి, భజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు ఛలో ప్రగతి భవన్ ముట్టడిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బయల్దేరిన వారిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నియంత పాలనను ఎండగడతాం అని అన్నారు. హిందువుల ఆరాధ్యదైవం అయినటువంటి గోవులను అక్రమంగా తరలించి వధిస్తున్నారని, గోవధను చాటుమాటున ప్రోత్సహిస్తూ నియంతలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గోవధ చట్టాన్ని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గోవులను వధించి కబేళాల కంపెనీలను మూసేసే విధంగా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పలుమార్లు హెచ్చరించినా కొన్ని రాష్ట్రాలు మాత్రం పట్టించుకోవడం లేదని అందులో తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గోవధను ఆపేవిధంగా చట్టం తేవాలని లేని పక్షంలో హిందు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అక్రమ అరెస్టులలో బిజెపి నాయకులు వర ప్రసాద్, రవి గౌడ్, రాజ్ జాస్వాల్,లక్ష్మణ్, నవీన్, నందు మరియు భజరంగ్ దళ్ నాయకులు బాలాజీ,శివ, గోవింద్, ఠాకూర్ తదితరులను మియపూర్, చందనగర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
