హక్కుల ఉల్లంఘన‌ జరిగితే ఉపేక్షించేది లేదు: డబ్లుహెచ్ఆర్ఏ జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: హక్కుల ఉల్లంఘన‌ జరిగితే‌ ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి అన్నారు. మియాపూర్ స్ఫూర్తిస్ అకాడమిక్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కులపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని, హక్కుల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదని, హక్కుల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులను ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దాసరపల్లి దినేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సమస్య ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ప్రజల హక్కుల పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రపంచ మానవ హక్కుల సంఘం ముందుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ చైర్ పర్సన్ బొమ్మిరెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణమని, మహిళల హక్కుల పై పోరాటం సాగించేందుకు ముందుంటామని తెలపడం జరిగింది. అనంతరం కొత్తగా సంస్థలో చేరిన వారికి నియామకపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ కొండ సంతోష్ కుమార్, వర్కింగ్ చైర్మెన్ ఎల్ . నరసింహారెడ్డి, కో ఆర్డినేటర్ జి.సురేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా చైర్మన్ వర్ధమాన్ మోహన్ చారి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ ఎల్.తిరుపతిరెడ్డి, వనపర్తి జిల్లా చైర్మన్ వి.తిరుపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ దండ సంపత్ రెడ్డి, మహబూబాద్ జిల్లా చైర్మన్ వెంకన్న, ఖమ్మం జిల్లా చైర్మన్ బిల్లా సతీష్ బాబు, రంగారెడ్డి జిల్లా చైర్మన్ సైదయ్య, మహిళా విభాగ తెలంగాణ స్టేట్ వైస్ చైర్ పర్సన్ సమంత యాదవ్, హైదరాబాద్ జిల్లా చైర్ పర్సన్ అనూష రెడ్డి, వైస్ చైర్ పర్సన్ మమత , మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కే .సరస్వతి, సెక్రటరీ జి. లావణ్య, సి.నీల చౌహాన్ మేడ్చల్ జిల్లా సెక్రటరీ,డి.గణిత తదితరులు ఉన్నారు.

హక్కుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జాతీయ చైర్మన్‌ సుబ్బారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here