రూ. 2 లక్షల ఎల్ ఓ సీ అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారి‌కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వెంకట సతీష్ అనే వ్యక్తి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించి ఎల్ ఓ సీ మంజూరు పత్రాన్ని కార్పొరేటర్లు రోజా దేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పోతుల రాజేందర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ పత్రాన్ని అందజేసిన విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here