నమస్తే శేరిలింగంపల్లి: సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే యోగాతోనే సాధ్యమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ యోగతో మాత్రమే సాధ్యమని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గునుగంటి శ్రీధర్ రావు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్కు కాలనీలో భారత్ స్వాభిమాన్ హైదరాబాద్ వెస్ట్ జోన్ జిల్లా అధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగిన పతాంజలి యోగా శిబిరం ముగిసింది. పతాంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వస్పరి శివుడు పర్యవేక్షణలో ప్రాణాయామ, త్రిదోశములు, అష్టాంగ యోగ, వాటర్ మేనేజ్ మెంట్, ఫుడ్ మేనేజ్ మెంట్ విషయాలపై వివరించారు. యోగా ప్రాధాన్యత, కలిగే లాభాలు వారం రోజుల పాటు వివరించినట్లు శ్రీధర్ రావు తెలిపారు.
మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా గురువులు నూనె సురేందర్, గారెల వెంకటేష్ వారం రోజుల పాటు యోగా శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో గుల్ మొహర్ కాలనీ అధ్యక్షుడు ఖాసీం, మహిళా పతాంజలి రాష్ట్ర అధ్యక్షురాలు మంజుశ్రీ నాయర్, బీ ఎస్ టీ రాష్ట్ర కార్యనిర్వహణ సెక్రటరీ నందనం కృపాకర్, రాష్ట్ర ఇంచార్జీ శివకుమార్, యోగా గురువులు రాజేందర్ తివారి, జగన్ యోగా సభ్యులు వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, కృష్ణా రెడ్డి, చంద్రకాంత్, భాస్కర్, వెంకట లక్ష్మీ, సాయిప్రియ, విజయ, దేవకి తదితరులు ఉన్నారు.