నమస్తే శేరిలింగంపల్లి: క్యాన్సర్ బాదిత కుటుంబానికి లయన్స్ క్లభ్ ఆప్ హైద్రాబాద్ హోప్ చేయూతనందించింది. వరంగల్‌కు చెందిన సాంబయ్య బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి కుటుంబంతో పాటు లింగంపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల సాంబయ్య (58) క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. అర్ధికంగా వెనుకబడిన సాంబయ్య క్యాన్సర్ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సాంబయ్యకు మూడు నెలలకు సరిపడే మందుల కోసం రూ.15 వేలు ఆర్ధిక సాయం చేసింది. క్లబ్ అధ్యక్షుడు కొండ విజయ్ చందానగర్ హుడాకాలనీలోని తన కార్యాలయం వద్ద సాంబయ్య భార్య రమణమ్మకు ఆదివారం రూ.15 వేలు అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఉపాధ్యక్షుడు తొపుగుండ మహిపాల్ రెడ్డి, కోశాధికారి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.