నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఆదివారం మియాపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీహరి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులుగా పీవై రమేష్, సలహాదారులుగా కంది జ్ఞానేశ్వర్, అధ్యక్షులుగా పోతరాజు లాలయ్య, ఉపాధ్యక్షులుగా బోడిక శ్రీను, ప్రధాన కార్యదర్శిగా వంశీ, కోశాధికారిగా కర్రే రమేష్, సంయుక్త కార్యదర్శిగా ఆనంద్ కుమార్, ప్రచార కార్యదర్శిగా నరేష్‌లు నియమితులయ్యారు. అదేవిధంగా శేరిలింగంపల్లి మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా కోడిచర్ల రాము, అధ్యక్షుడిగా జల్లె విజమ్, ఉపాధ్యక్షులుగా మల్లని ప్రభు, ప్రధాన కార్యదర్శిగా సూర్య, కోశాధికారిగా సమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్, ప్రచార కార్యదర్శిగా నివర్తిలు నియమితులయ్యారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీహరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ అంబేద్కర్ ఆశయ సాధనకై సంఘం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, ఉపాధ్యక్షులు పారంద స్వామి, హనుమకొండ జిల్లా ఇన్చార్జి తుమ్మల సదానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.