సున్నం చెరువు క‌బ్జాకు గురి కాకుండా చూడాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువులో జరుగుతున్న పనులను హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించి, చెరువు FTL ,బఫర్ జోన్ సరిహద్దులను నిర్ణయించిన తర్వాత పనులు చేపట్టాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సున్నం చెరువు పరిధిలోని FTL, బఫర్ జోన్ ల సరిహద్దులు నిర్ణయించి పనులు ప్రాంభించాలని హైడ్రా అధికారులను కోరుతున్నాను అని అన్నారు. గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తప్పిదాల వలన చెరువు సరిహద్దులను మార్చడం జరిగినది అని, చెరువు పూర్తి స్థాయి లో సరిహద్దులు నిర్ణయించిన తర్వాతే పనులు చేపట్టాలని, గతంలో తప్పిదాలు చేసి, వాస్తవాలను కప్పి పుచ్చి హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టించిన అధికారులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూర దృష్టితో హైడ్రాను ఏర్పాటు చేశార‌ని, చెరువులు, నాలాలను కబ్జాల నుండి రక్షించడానికి ఏర్పాటు చేశారు అని అన్నారు. కానీ హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను శిక్షించాలని కోరారు.

రెవెన్యూ , ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో సున్నం చెరువు కబ్జాకు గుర‌వుతుంద‌ని, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిదిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాల‌ని అన్నారు. అధికారులు మేల్కొని అక్రమ కట్టడాలు కూల్చివేసి పాత ఫెన్సింగ్ ప్రకారం చెరువును యథాస్థితికి తీసుకురావాలని చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి చెరువు చుట్టూ ఫెన్సిగ్ వేసి చెరువు మళ్ళీ కబ్జాకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here