నమస్తే శేరిలింగంపల్లి: తుఫాన్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ఉండాలని తెలంగాణ రోడ్డు ట్రాన్స్ ఫోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రుద్రకుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ పేర్కొన్నారు. గచ్చిబౌలి చౌరస్తాలో తుఫాన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రుద్ర కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ మాట్లాడుతూ తుఫాన్ వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు విపరీతమయ్యాయని చెప్పారు. పోలీసులు నిర్బంధానికి గురిచేసి కార్మికులను వేధిస్తున్నారని, కార్మికులందరి ఐకమత్యంతో తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ యూనియన్ ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని కార్మికులను ఉద్దేశించి చెప్పారు. ఈ సమావేశంలో సీఐటీయూ యూనియన్, తెలంగాణ రోడ్డు ట్రాన్స్ పొర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.