నమస్తే శేరిలింగంపల్లి: మాజీ మంత్రి, హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ ను కమలాపూర్ లోని ఆయన స్వగృహంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్ పరామర్శించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ బిజెపి నాయకులు బీఆర్ గౌడ్, శివ, బిజెపి నాయకులు భాను యాదవ్, మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, డివిజన్ సెక్రెటరీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.