విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం‌ మొదటి ప్రాధాన్యత – ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవంలో మంత్రి సబితారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, రాష్ట్రంలోని 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టళ్ల‌ నిర్మాణం చేపట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో ప్రభుత్వ లేధర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ లో రూ. 3 కోట్ల తో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బాలుర హాస్టల్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే 2,200 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 22 పాలిటెక్నిక్ హాస్టళ్ళను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి 3 కోట్ల చొప్పున 66 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాయదుర్గం లో ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించు కోవడం జరిగిందన్నారు. అసంపూర్తిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గాంధీ రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ వాణి దేవి రూ. 10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆవరణలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మొక్కలు నాటి, ప్రతి శుభ సందర్భంలో లో మొక్కలు నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి సబితాఇంద్రారెడ్టి, ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here