హనుమాన్ యూత్ విఘ్నేశ్వరుడికి సీఐ వెంకటేష్ దంపతుల ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి:వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ హఫిజ్ పెట్ లో హనుమాన్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మియాపూర్ సీఐ శ్యామల వెంకటేష్ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రోత్సవాలు ప్రశాంతవాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ వెంకటేష్ పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో వినాయకున్ని పూజించి నిమజ్జనం చేయాలన్నారు. మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఐ వెంకటేష్ దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here