మాదాపూర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి ‌గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ.5.63 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమయ్యే ‌అన్ని మౌలిక వసతుల‌ కల్పనకు‌ కృషి చేయనున్నట్లు చెప్పారు. నవభారత నగర్, సీజీఆర్ స్కూల్ వీధి, అయ్యప్ప సొసైటీ, మొండి కుంటా, ఖానామెట్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్, హుండై, గోకుల్ ప్లాట్స్ లో ఈ అభివృద్ధి పనులు‌ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు మధుసూధన్ రెడ్డి, బిక్షపతి ముదిరాజ్, గౌస్, గంగాల గణేష్ యాదవ్, సాదిక్, నురుద్దిన్, వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్,అలి, సహదేవ్, ప్రభు, కేవి రావు, మధుసూధన్, సాంబయ్య, రామాంజనేయులు, శ్రీనివాస్,రాంచందర్, పితాని లక్ష్మి, కనకమామిడి వెంకటేష్ గౌడ్, రాజు, ప్రసాద్,  సర్వార్,  ప్రసాద్,  రవి,  మహిందర్, శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, మల్లా రెడ్డి, వీరారెడ్డి, రాజేష్, శ్రీనివాస్, అనిల్ కుమార్ కావూరి, ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, రఘు, యూత్ నాయకులు కరణ్, ఆఫ్రోజ్, మహిళలు సీతమ్మ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here