శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాం నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని , ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల రాజేందర్, అంబాదాసు, రాం నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షుడు చాట్ల రవి, ప్రధాన కార్యదర్శి అచ్చగారి రాజీ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు సత్యనారయణ చెట్టి , చంద్రయ్య, సురేష్ నక్క, ఎం రాజి రెడ్డి, ఉమా మహేశ్వర్ రావు, బ్రహ్మయ్య, నాగార్జున రెడ్డి , రాఘవేందర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.