శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నాంది పలుకుతూ పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు చందానగర్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి Revanth Reddy, పీఏసీ చైర్మన్ Arekapudi Gandhi హాజరుకానున్నారు. వారి చేతుల మీదుగా మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, లింగంపల్లి ఆర్‌ఓబీ ఫ్లైఓవర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, ఖాకాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు.






