శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పరిధిలోని అరుణోదయ కాలనీలో ఉన్న జాయ్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను జాయ్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ L రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ P V నందకుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, PCC జనరల్ సెక్రటరీ V జగదీశ్వర్ గౌడ్ హాజరై మాట్లాడుతూ జాయ్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి స్వార్థ పూరిత సమాజంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్న ఈ తరుణంలో డాక్టర్ L రాజ్ కుమార్ వృత్తి రీత్యా వైద్యుడిగా ఉంటూ తను ఆర్జించిన దాంట్లో కొంత మొత్తం ఈ విధమైన సేవా కార్యక్రమాలలో ఖర్చు చేయడం చాలా అభినందించ దగ్గ విషయమని కొనియాడారు. బొల్లారం పారిశ్రామిక వాడలోని డిజైర్ సొసైటీ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు గత 17 సంవత్సరాల నుండి వైద్య సేవలు అందించడంతోపాటు తన స్వగ్రామమైన పడకల్ గ్రామంలో ప్రతి శనివారం వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

మన కుటుంబాలలోని పిల్లలకు చిన్నతనం నుండే సేవా భావం అలవాటు చేయాలని, అందులో భాగంగా ముందు వారి వారి ఇండ్లలో ఉన్న తాతయ్యలకు, నాన్నమ్మలకు, అమ్మమ్మలకు సేవలు చేయడం అలవరచాలన్నారు. అప్పుడే వారిలో సేవా భావం అలవడుతుందని అన్నారు. నేటి యువతకు ముఖ్యంగా పేదవారి ఉపాధికి నర్సింగ్ కాలేజీలను స్థాపిస్తే తమ సంపూర్ణ సహాయ సహకారాలను హెల్త్ యూనివర్సిటీ తరపున అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ P రవి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు, శ్రీహరి, వసంత కుమార్, G.రవిబాబు డిజైర్ సొసైటీ, K G రంగనాథన్ TCS, రవి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉద్యోగి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.





