నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రానివ్వాలని, కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం పెద్ద పీట వేస్తూ మహిళా సాధికారత కోసం పని చేస్తున్నదని మాజీ మంత్రి బాబుమోహన్ పేర్కొన్నారు. జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాఖ సమన్వయకర్త కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండ పీజేఆర్ కమ్యూనిటీ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ మంత్రి బాబుమోహన్, స్వామి వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షుడు జ్ఞానేంద్ర ప్రసాద్, ఎన్ వై కే జిల్లా అధికారి ఇజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతు మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. మహిళల కోసం కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన కుమార్ యాదవ్ ను అభినందించారు. కుమార్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకుని యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఇలాంటి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని అన్నారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి మంచి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారే నిలబడటానికి ఈ శిబిరం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి, మహిళ సమాఖ్య నాయకురాళ్లు గణిత, సరస్వతి, సమత, లక్ష్మీ, కవిత, అనిత, మున్నిశా, రాజు, రామకృష్ణ, సంతోష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.