ప్ర‌తి కాల‌నీ వాసులు సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎన్‌క్లేవ్ కాలనీలో కాల‌నీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 31 సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ కాస్ట్రో రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

సీసీ కెమెరాల‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ కాస్ట్రో రెడ్డి, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం వ‌ల్ల ఎంతో భ‌ద్ర‌త ఉంటుంద‌న్నారు. ప్ర‌తి కాల‌నీ వాసులు ఇలాగే సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. అవ‌స‌రం అయితే త‌న స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మీ, వెంకటేష్, రామచంద్రా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అక్బర్ ఖాన్, కాలనీ ప్రెసిడెంట్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ జయ్ కుమార్, ట్రెజరర్ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ వీరశెట్టి, మెంబ‌ర్స్ ఇబ్రహీం, రాజ‌ గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here