జాతీయ స్థాయి కుంగ్ ఫూ పోటీల్లో స‌త్తాచాటిన పీజేఆర్ స్టేడియం విద్యార్థులు – అభినందించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జాతీయ స్థాయి క‌రాటే కుంఫు పోటీల్లో చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియం విద్యార్థులు స‌త్తా చాటారు. ఈ నెల 3వ తేదీన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప‌ట్ట‌ణంలో ల‌క్కీ మార్ష‌ల్ ఆర్ట్స్ ఆకాడ‌మి ఆద్వ‌ర్యంలో 7వ జాతీయ‌స్థాయి ఓపెన్ క‌రాటే చాంపియ‌న్ షిప్ 2021 ఉత్సాహంగా జ‌రిగింది. కాగా చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియం నుంచి ఐదు మంది విద్యార్థులు కుంగ్‌ఫూ పోటీల్లో భాగ‌స్వాముల‌య్యారు. డి.చంద్ర‌శేఖ‌ర్‌(స్వ‌ర్ణం), డి.పూజిత‌(స్వ‌ర్ణం), ర‌వితేజ‌(స్వ‌ర్ణం), సంజీవ్‌(స్వ‌ర్ణం), ప్ర‌శాంత్‌(స్వ‌ర్ణం/ర‌జ‌తం), చందు(ర‌జ‌తం), రుతు(ర‌జ‌తం) ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నారు. కాగా ప్ర‌భుత్వ విప్ గాంధీ శుక్ర‌వారం ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌ను, అందుకు ప్రోత్స‌హించిన కోచ్ గ్రాండ్ మాస్ట‌ర్‌ డి.ల‌క్ష్మ‌ణ్‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. భ‌విష్య‌త్తులో మరింత‌లా రాణించాల‌ని క్రీడాకారుల‌కు సూచించారు.

కుంగ్ ఫూ విజేత‌ల‌ను, కోచ్ ల‌క్ష్మ‌ణ్‌ల‌ను అభినందిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here