నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పీజేఆర్ స్టేడియం కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఇటీవల గోవాలో జరిగిన వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో పీజేఆర్ స్టేడియం నుంచి తెలంగాణ రాష్ట్రం తరపున ఐదు మందు భాగస్వాములయ్యారు. కాగా ఆర్.శ్రావణీ బాయి, పి.ప్రభు కుమార్‌లు అద్భుత ప్రతిభ కనబరచి ఇద్దరు బంగారు పతకాలను సాధించారు. ఈ క్రమంలోనే త్వరలో బ్యాంకాక్‌లో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు శ్రావణీ బాయి ఎంపికయ్యారు. అదేవిధంగా దేశ రాజదాని న్యూ డిల్లీలో జరిగిన ఖేలో ఇండియా/ఫిట్ ఇండియా 5వ యువ క్రీడోత్సవాల్లోను పీజేఆర్ స్టేడియం విద్యార్థులు కిక్ బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర తరపున పీజేఆర్ నుంచి పాల్గొన్న 8 మంది క్రీడాకారులు ఆర్.శ్రావణీ బాయి, పి.ప్రభుకుమార్, పి.సాయిధీక్షిత్, ఈ.దీపక్, యోగేష్, ఏ.క్రాంతికుమార్, నాగేందర్.ఎం, ఎం.హర్షవర్ధన్‌లు వివిధ కేటగిరిల్లో బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.
అభినందించిన ప్రభుత్వ విప్ గాంధీ…
కిక్ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన చందానగర్ పీజేఆర్ స్టేడియం క్రీడాకారులను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. కిక్ బాక్సింగ్ రాష్ట్ర గౌరవాన్ని కాపాడినందుకు కోచ్ ఎస్‌కే ముజాహిద్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింతలా రాణించాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచే యువతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని, వ్యక్తిగతంగా తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.