శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): డా. శోభా రాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరుగుతున్న అన్నమ నృత్యార్చనలో లహరి డాన్స్ అకాడమీ గురువు డా. ఝాన్సీ రామ్ శిష్యులు శాన్వి, దీక్షిత, సాహితి, హర్షిత, లక్షిత, తనుశ్రీ, నవ్య, నందిని, ఆద్విక, లక్ష్మి, లాస్య రెడ్డి, నంద గోపాల్, నిత్య నందిని, వేధ్యశ్రీ, మోక్షదృతి, అన్షు సంయుక్తంగా వినాయక కౌత్వం, అలరులు కురియగ, ముద్దుగారే, దశావతారం, శివ కౌత్వం, జతిస్వరం, పలుకే బంగారమాయెనా, విన్నపాలు వినవలె, అష్టలక్ష్మి అనే ప్రసిద్ధ సంకీర్తనలకు తమ కూచిపూడి నృత్య ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.