కొత్త రేష‌న్‌కార్డుల‌ జారీపై సివిల్ స‌ప్లై అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సివిల్ స‌ప్లై అధికారులతో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శుక్ర‌వారం ప్ర‌త్యేక‌ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ఇటీవల ప్రకటించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ ఏఎస్ఓ బాల సరోజిని దేవి, బాల నగర్ ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డిల‌తో రేష‌న్‌కార్డుల జారీకి సంబంధించి ప‌లు ముఖ్యమైన అంశాల‌ను చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కార్డులు అందేలా చూడలని అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ప్రభుత్వం కలిపించే సదుపాయాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూసే బాధ్యత మనందరి పైన ఉంద‌ని అన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా జరుగలని, మధ్యలో బ్రోకర్లను, మధ్యవర్తులను ప్రోత్సహించవద్దని అన్నారు. అదేవిధంగా కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులను రేషన్ కార్డ్ లో నమోదు చేయడానికి అవకాశం కలిపించాలని అన్నారు. అదేవిధంగా కొంత మందికి సరిగ్గా రేషన్ బియ్యం అంద‌డం లేద‌ని, అలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడలని సివిల్ స‌ప్లై అధికారుల‌కు సూచించారు. కొత్త రేషన్ కార్డుల కొరకు ప్రజలు ఎవరు మధ్యవర్తులు, బ్రోకర్ల ను నమ్మి మోసపోవద్దు అని, అర్హులైన నిజమైన ప్రతి లబ్ధిదారులకు రేషన్ కార్డులు వస్తాయ‌ని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పర్చుకోవలని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

ఏఎస్ఓలు బాల స‌రోజిని దేవి, శ్రీనివాస్ రెడ్డిల‌తో మాట్లాడుతూ ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here