శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆంఫి థియేటర్ లో శ్రీ సత్య సాయి విద్యా మందిర్ శిష్య బృందం వారు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ప్రణవాకారం గణేశా స్తుతి , తిల్లాన నృత్యంతో పాటు కూచిపూడి కళాకారిణి అమ్రితా శ్రిల్ నృత్య దర్శకత్వం చేసిన “నవదుర్గ ” నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. కళాకారులు ప్రీతిక, హర్షిని, శ్వేతా, సుజాత నందిని, వాసవి, పూజిత, సంధ్య తదితరులు నృత్య ప్రదర్శన చేసిన వారిలో ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here