నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోసం మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. శ్రీరామ్ నగర్ కాలనీతో పాటు శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధుని ప్రార్థించారు. డివిజన్ టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, కార్తీక్, ఆర్గనైజర్ నాగరాజు, రవికుమార్, గోపాల్ యాదవ్, కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.