కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులకు ఎనలేని వైభవం వచ్చిందని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూళ్లలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోలోని కొత్తగూడ లోని ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ లో, కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్ లోని ప్రైమరీ స్కూల్ లో, గచ్చిబౌలిలోని ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా బోధన చేయనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

ఈ కార్యక్రమంలో 8వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్లు టీ.గంగారం, టీ ఎన్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్లు రాథోడ్ దేవిదాస్, రహమాన్, సత్యనారాయణ, నారాయణ దాసు, బెటాలియన్ క్వార్టర్ మాస్టర్ ఎ. ప్రభాకర్, సంక్షేమ అధికారి ఎం. ప్రేమ్ కుమార్, టీఎస్ఈడబ్ల్యూఐడిసి సిబ్బంది విక్రమ్, శ్యామ్, పాఠశాలల హెచ్ఎం లు జె. గోవిందు, బాలరాజు గౌడ్, మొహ్మద్ ఇషాక్ షరీఫ్, పి. వెంకటేశ్వర రావు, తిరుపతయ్య, మొహ్మద్ మొయినుద్దీన్, రామ చంద్రయ్య, హన్మంతు, వినోద్ కుమార్, దానయ్య, గోవర్ధన్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, ఊట్ల దశరద్, జంగంగౌడ్, నరసింహ సాగర్, రవి శంకర్ నాయక్, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు మన బడి లో పాల్గొన్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here