నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణ దిశగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరంక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమం చేపట్టారు.
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, బొటానికల్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు కలిసి మొక్కలు నాటారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి రన్ ఫర్ పీస్ 2వ విడత కార్యక్రమం కరపత్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బోటానికల్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, సెక్రటరీ బాలకిషన్, అసోసియేషన్ సభ్యులు షేక్ చాంద్ పాషా, రాజు, దీరజ్, నాగరాజు, మూర్తి, శ్రీనివాస్, శ్రీను బాబు, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, నాయకులు నీరుడి గణేష్ ముదిరాజ్, నరసింహ సాగర్, రక్తపు జంగంగౌడ్, తిరుపతి యాదవ్, ఎర్రరాజు, గణపతి, కృష్ణ సాగర్, అశోక్ సాగర్, నరేష్ ముదిరాజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.