ముక్కోటి వృక్షార్చనలో‌ మొక్కలు నాటిన కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు 45వ జన్మదినం సందర్బంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ నాయకులతో కలసి పలు రకాల మొక్కలను నాటారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ హై టెన్షన్ రోడ్డు ప్రభుపాద కూడలి వద్ద గల జీహెచ్ఎంసి పార్కు ప్రాంతంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు రాజేష్ యాదవ్, సంయుక్త కార్యదర్శి పేరుక రమేష్ పటేల్, కార్యదర్శి బలరాం యాదవ్, నాయకులు చాంద్ పాషా, జంగం గౌడ్,గౌరీ,రవి గౌడ్, శ్రీనివాస్ చౌదరి, అడ్వకేట్ కృష్ణవేణి, తిరుపతి యాదవ్, రవి శంకర్ నాయక్, శ్రీరామ్ నగర్ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, కుమ్మరి శ్రీను, యూత్ నాయకులు దీపక్, సత్యం గౌడ్, వివి రావు తదితరులు పాల్గొన్నారు.

కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here